Singer | Anurag Kulkarni |
Music | Jay Krish |
Song Writer | Rakendu Mouli |
Pain Song Lyrics in English
HEY.. EMAINDILA NAATHO NAAKE
EE YUDDHAALE AAGAVAA?
NAA KALLANCHULLONA
KANNEELLAYYE KALALE
NEE JAADA THELUPUVA?
HEY.. CHESINDI EE THAPPO
THELISELOGA
EE NIMUSHAALE NILUVAVA?
MMM.. SIKSHINCHE
YEKAANTHAALA YUGAMULU
OO.. KSHANAANI KOKATIGA
SWAPNAALA BAATALO
SATYAALA VETALU..
SOONYAALA KOTALO
DOBOOOCHULATALU…
ENNAALLU AAGANU
KANNEELLA VEAGANU..
NAA ORPU ODENE
NITTOORPU KEKALAA….
KALA CHEDIRINA KALAKALAMULA
KALATHALA KAARANAMEDO..
HRUDI MADI ADI IDIYANU
KADALANI KATHA NEEVE KADAA…
DHAGA DHAGAMANU SEGA
RAGILINA BHAGA BHUGA
GUNDENU KAALCHE..
SATHA MADHANAPU RUTHUVUNA
SATHAMATHAMULA..
CHITHIKINA MATHI CHITHI
ATHAKANI BRATHUKUNA….
HEY.. EMAINDILA
NAALO NAATHO NAAKE
EE YUDDHAALE AAGAVAA?
NAA KALLANCHULLONA
KANNEELLAYYE KALALE
NEE JAADA THELUPUVA?
—————————————
Pain Song Lyrics in Telugu
హే.. ఏమైందిలా నాలో నాతో నాకే
ఈ యుద్ధాలే ఆగవా?
నా కళ్ళంచుల్లోన కన్నీళ్ళయ్యే కలలే
నీ జాడ తెలుపవా?
హే.. చేసింది ఏ తప్పో తెలిసేలోగా
ఈ నిముషాలే నిలువవా?
హ్మ్.. శిక్షించే ఏకాంతాల యుగములు
ఓ క్షణానికొకటిగా !
స్వప్నాల బాటలో సత్యాల వేటలు
సూన్యల కోటలో దోబూచులాటలు
ఎన్నాళ్ళు ఆగను, కన్నీళ్ళ వేగను
నా ఓర్పు ఓడెనే, నిట్టూర్పు కేకలా
కల చెదిరిన కలకలముల కలతల కారణమేదో
హృది మది అది ఇదియను కదలని కథ నీవే కదా
ధగ ధగమను సెగ రగిలిన భగ భుగ గుండెని కాల్చే
శత మథనపు ఋతువున సతమతముల
చితికిన మతి చితి అతకని బ్రతుకున
హే.. ఏమైందిలా నాలో నాతో నాకే
ఈ యుద్ధాలే ఆగవా
నా కళ్ళంచుల్లోన కన్నీళ్ళయ్యే కలలే
నీ జాడ తెలుపవా?